: రూ.15 లక్షలిస్తే వైద్యానికి అనుమతి... పట్టుబడ్డ రాకెట్


డబ్బులుంటే వైద్యులైపోవడం మనదేశంలో చిటికెలో పని. వైద్యానికి అనుమతులు కూడా సులభంగానే వచ్చేస్తాయ్! వైద్య డిగ్రీ చేసిన వారెవరైనా దేశంలో వైద్యసేవలు అందించాలంటే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనుమతి తప్పనిసరి. చైనా వైద్య డిగ్రీలున్న వారికి ఈ అనుమతి పత్రాలను 15లక్షల రూపాయలకు విక్రయిస్తున్న ఓ ముఠాను సీబీఐ అధికారులు పట్టుకున్నారు. ప్రధాన నిందితుడు జతిన్ జొగాడియా, మరో ఏడుగురు వైద్యులను అరెస్ట్ చేశారు. జగాడియాకు కావాల్సిన సహాయ సహకారాలను మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సిబ్బంది అందిస్తున్నట్లు తేలింది. 'చైనాలో చదువుకుంటే ఎంసీఐ అనుమతి పత్రం ఇప్పించే పూచీ నాది' అంటూ విద్యార్థులతో జొగాడియా ఒప్పందాలు చేసుకుంటున్నట్లు గుర్తించారు.

  • Loading...

More Telugu News