: తెలంగాణకి బీసీని ముఖ్యమంత్రిగా చేస్తేనే మేలు: ఎర్రబెల్లి
బీసీని ముఖ్యమంత్రి చేస్తామని తెలుగుదేశం పార్టీ ప్రకటించిందని ఆ పార్టీ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. పార్టీలో అందర్నీ ఒప్పించి చంద్రబాబు తెలంగాణ కమిటీకి బీసీని అధ్యక్షుడిగా నియమించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. హైదరాబాదులో ఈరోజు (బుధవారం) ఉదయం ఆయన మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణకి బీసీ ముఖ్యమంత్రి వస్తేనే ప్రయోజనం చేకూరుతుందని ఆయన చెప్పారు. తెలంగాణ కోసం ఎంతో మంది ఉద్యమించారని... కొండా లక్ష్మణ్ బాపూజీ, గద్దర్, విమలక్క సహా ఎందరో విద్యార్థుల పోరాటంగానే తెలంగాణ ఏర్పడిందని ఆయన అన్నారు.