: ఇకపై అమెరికా అధ్యక్షుడి రక్షణ బాధ్యత ఆమెదే!
పింగళి గారు ఎప్పుడో చెప్పారు ... 'అది ఇది ఏమని అన్ని రంగముల ... మగధీరుల నెదిరించారు' అంటూ దశాబ్దాల క్రితమే ఆయన 'గుండమ్మకథ' సినిమాలో మన మహిళామణులు అన్ని రంగాలలోనూ ఎలా దూసుకుపోతున్నారో పాట రూపంలో సవివరంగా చెప్పుకొచ్చారు. ఇప్పుడు మహిళ మరో అడుగు ముందుకేసింది. అమెరికా అధ్యక్షుడి రక్షణ వ్యవహారాలను పర్యవేక్షించే బాధ్యతను తొలిసారిగా ఓ మహిళ స్వీకరించింది.
అమెరికా చరిత్రలోనే ఇదో పెద్ద మలుపు. అమెరికా రహస్యసేవల విభాగం డైరెక్టర్ గా జూలియా పియర్సన్ అనే మహిళను అధ్యక్షుడు ఒబామా తాజాగా నియమించారు. ఆ రంగంలో ఆమెకు ముప్పై ఏళ్ల అనుభవం వుందట. అధ్యక్షుడు, ఆయన కుటుంబ సభ్యులు, ఇతర ప్రధాన పాలకుల వ్యక్తిగత రక్షణ వ్యవహారాలను ఇకపై జూలియా పర్యవేక్షిస్తుంది.