: ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి ఆస్తుల విలువ 190 కోట్లు
ఇన్ఫోసిస్ బోర్డు మాజీ సభ్యుడు, బెంగళూరు (మధ్య) లోక్ సభ నియోజకవర్గం నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ తరపున పోటీ చేస్తున్న బాలకృష్ణన్ తన ఆస్తులను ప్రకటించారు. ఎన్నికల కమిషన్ కు సమర్పించిన అఫిడవిట్ లో ఆయన తన ఆస్తుల విలువను 190 కోట్ల రూపాయలని పేర్కొన్నారు. తన పేరు మీద 154 కోట్ల రూపాయలు, తన భార్య పేరు మీద 19.43 కోట్లు, ఇంకా ఇతర ఆస్తులు ఉన్నట్టు ఆయన ఈసీ అఫిడవిట్ లో పేర్కొన్నారు.