: 10 స్థానాలు మావే: గొగోయ్
అసోంలోని 14 లోక్ సభ స్థానాల్లో పది స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ ఆశాభావం వ్యక్తం చేశారు. దిస్ పూర్ లో ఆయన మాట్లాడుతూ, అసోంలో తమ లక్ష్యం 12 స్థానాలు అయినప్పటికీ 10 స్థానాలను తప్పకుండా గెలుచుకుంటామని నమ్మకాన్ని వ్యక్తం చేశారు. 12 స్థానాలను గెలిచినా ఆశ్చర్యపోనక్కర్లేదని అన్నారు. ప్రస్తుతం అసోం నుంచి ఏడుగురు కాంగ్రెస్ ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.