: సోనియా, రాహుల్ గాంధీలకు నల్లజెండాలు చూపించరేం?: కేజ్రీవాల్


కాంగ్రెస్, బీజేపీలకు ప్రధాన శత్రువు తమ పార్టీయేనని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఈరోజు (మంగళవారం) వారణాసిలో జరిగిన రోడ్ షోలో ఆయన పాల్గొని ప్రసంగించారు. కేజ్రీవాల్ ర్యాలీగా వెళుతుండగా కొందరు నల్లజెండాలతో ఆయనకు నిరసన తెలిపారు. దీంతో, తమ పార్టీకి ఎందుకు నల్లజెండాలు చూపుతున్నారని ఆయన నిలదీశారు. కాంగ్రెస్, బీజేపీలు పరస్పరం నల్లజెండాలు ఎందుకు చూపించుకోవని ఆయన ప్రశ్నించారు.

సోనియా, రాహుల్ గాంధీలకు వ్యతిరేకంగా నల్లజెండాలు చూపించే దమ్ము బీజేపీ నేతలకు ఉందా? అని కేజ్రీవాల్ సవాల్ విసిరారు. బీజేపీ నాయకులకు నల్లజెండాలు చూపించే ధైర్యం కాంగ్రెస్ కు ఉందా? అని ఆయన ప్రశ్నించారు. గుజరాత్ వెళ్లినప్పుడు నరేంద్ర మోడీ మనుషులు తనకు నల్లజెండాలతో స్వాగతం పలికిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. వారణాసిలోనూ మళ్లీ అదే జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, నల్లజెండాలు, సిరా చల్లడం వంటివి వారణాసి సంప్రదాయం కాదని ఆయన హితవు పలికారు.

  • Loading...

More Telugu News