: సఫారీ జట్టుకు జరిమానా
న్యూజిలాండ్ తో మ్యాచ్ సందర్భంగా దక్షిణాఫ్రికా జట్టు జరిమానాకు గురైంది. బంగ్లాదేశ్ లో జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ లో ఈ రెండు జట్లు నిన్న తలపడ్డాయి. అయితే, సఫారీ జట్టు స్లో ఓవర్ రేట్ తప్పిదానికి పాల్పడిందని మ్యాచ్ రిఫరీ జవగళ్ శ్రీనాథ్ తేల్చారు. అంతేగాకుండా ఆ జట్టు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ కు మ్యాచ్ ఫీజులో 40 శాతం కోత విధించారు. జట్టు సభ్యులకు 20 శాతం కోత విధించారు.