: వారసత్వ రాజకీయాలను తరిమికొట్టిండి: జేపీ
దేశంలో 2 కోట్ల మంది యువకులు తొలిసారి ఓటు హక్కు వినియోగించుకోనున్నారని లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో వారసత్వ రాజకీయాలు నడుస్తున్నాయని మండిపడ్డారు. ఎల్లకాలం వీరికి ఊడిగం చేయడానికి ప్రజలు చేతకాని వారా? అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం కొడుకు, కూతురు అనే కారణంగా ఎన్నికల్లోకి వస్తే వారిని తిరస్కరించాలని ఆయన పిలుపునిచ్చారు. రాజకీయాల్లోకి వచ్చేందుకు అర్హత కలిగిన వారు చాలామంది ఉన్నారని ఆయన తెలిపారు. రాజకీయ నాయకుల పిల్లలతో సమానంగా మన పిల్లలు కూడా ఉండాలని ఆయన సూచించారు. అందుకే వారసత్వ రాజకీయాలను తరిమి కొట్టాలని ఆయన రాష్ట్ర ప్రజలకు సూచించారు.