: తనయుడిని పార్టీ నుంచి తొలగించిన కరుణానిధి
డీఎంకే చీఫ్ కరుణానిధి (89) తన కుమారుడు అళగిరిని పార్టీ నుంచి బహిష్కరించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందున అతడిపై శాశ్వతంగా వేటు వేస్తున్నట్టు కరుణానిధి తెలిపారు. పార్టీ జనరల్ సెక్రటరీతో కలిసి తానీ నిర్ణయం తీసుకున్నానని ఆయన చెప్పారు. క్రమశిక్షణ చర్యల కింద అళగిరిని గత ఫిబ్రవరిలో పార్టీ పదవుల నుంచి తొలగించారు.
అళగిరి తన సోదరుడు స్టాలిన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసి పార్టీ ఆగ్రహానికి గురవడం తెలిసిందే. 'మరికొన్ని రోజుల్లో స్టాలిన్ చావు ఖాయం' అని అళగిరి పరుషంగా వ్యాఖ్యానించారు. పార్టీ తన అభ్యర్థుల జాబితాను వెల్లడించిన రోజు కూడా అళగిరి శాపనార్థాలు పెట్టారు. డీఎంకే పార్టీ డబ్బు సంచులకు అమ్ముడుపోయిందని, ఎన్నికల్లో మట్టికొట్టుకుపోవడం ఖాయమని దుమ్మెత్తిపోశారు.