: బాబు మాట శిరోధార్యమంటున్న వంశీ


విజయవాడ లోక్ సభ నియోజకవర్గ ఇన్ ఛార్జిగా తనను నియమించకపోవడం పట్ల అలకబూనినట్లు వస్తున్న వార్తలకు టీడీపీ నేత వల్లభనేని వంశీ మోహన్ తెరదించే ప్రయత్నం చేశారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు వాక్కును శిరసావహిస్తానని వంశీ చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లో గన్నవరం సీటు ఇవ్వకపోయినా పార్టీని వీడనని స్పష్టం చేశారు. అయితే, ఎట్టి పరిస్థితుల్లోనూ వేరొక పార్టీలో చేరేదిలేదన్న ఆయన..  టీడీపీకి తన సేవలు అవసరం లేని రోజున ట్రస్టు ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తానని చెబుతున్నారు. 

  • Loading...

More Telugu News