: దిల్ సుఖ్ నగర్ పేలుళ్ల కేసులో మూడో నిందితుడు అరెస్టు
ఇండియన్ ముజాహిదీన్ కమాండర్ తహ్సీన్ అఖ్తర్ అలియాస్ మోనును ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. పేలుళ్ల కేసులో మోను మూడో నిందితుడిగా ఉన్నాడు. బుద్ధగయ, పాట్నా, ముంబయి పేలుళ్ల కేసుల్లోనూ మోను ప్రమేయం ఉన్నట్లు పోలీసులు దర్యాప్తులో వెల్లడించారు. మోనుపై జాతీయ దర్యాప్తు బృందం రూ.10 లక్షల రివార్డు ప్రకటించింది.