: 352 కంపెనీల కేంద్ర బలగాలు వచ్చాయి: భన్వర్ లాల్


ఎన్నికల బందోబస్తు కోసం రాష్ట్రానికి 352 కంపెనీల కేంద్ర బలగాలు వచ్చినట్టు రాష్ట్ర ఎన్నికల అధికారి భన్వర్ లాల్ తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా అన్ని చర్యలు తీసుకున్నామని చెప్పారు. వరంగల్ లో ఈవీఎంలు భద్రపరిచే కార్యాలయాన్ని ప్రారంభించిన సందర్భంగా భన్వర్ లాల్ ఈ రోజు మీడియాతో మాట్లాడారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో కనీస వసతులు కల్పిస్తామని తెలిపారు. ఇప్పటి వరకు వాహన తనిఖీల్లో రూ. 56 కోట్లు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.

  • Loading...

More Telugu News