: హిమబిందు హత్య కేసులో నిజ నిర్థారణ


కృష్ణాజిల్లా యనమలకుదురులో సప్తగిరి గ్రామీణ బ్యాంక్ మేనేజర్ సాయిరాం భార్య హిమబిందు హత్య కేసులో వాస్తవాలను పోలీసులు వెలికితీశారు. కారు డ్రైవర్ సుభానితో పాటు అతనికి సహకరించిన స్నేహితుడు గోపీకృష్ణను పోలీసులు అరెస్ట్ చేశారు. పథకం ప్రకారమే మరో నలుగురి సహాయంతో హిమబిందుపై అత్యాచారం చేసి హత్య చేసినట్లు నిందితులు వెల్లడించారు. అత్యాచారం అనంతరం డ్రైవర్ సుభానీని గుర్తిస్తుందని వారు ఆమె గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసులు చెప్పారు. నిందితుల నుంచి బంగారు ఆభరణాలు, వెయ్యి రూపాయల నగదు, మూడు ఫోన్లు పోలీసులు స్వాధీనం తీసుకున్నారు. వారిపై కుట్ర, డెకాయిట్, నిర్భయ కేసులు నమోదు చేశారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా న్యాయం చేయాలని ప్రభుత్వానికి నివేదిక పంపినట్లు పోలీసులు తెలిపారు. మిగిలిన నలుగురు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

  • Loading...

More Telugu News