: మోడీలు గీడీలు మనకేంజెయ్యరు: కేసీఆర్
కొంత మంది యువకులు అసెంబ్లీ ఓటు టీఆర్ఎస్ కి వేస్తామని, లోక్ సభకైతే మోడీకి ఓటు వేస్తామని చెబుతున్నారని, అది తప్పని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హితవు పలికారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, 'మోడీలు గీడీలు మనకేంజెయ్యరు. అందువల్ల అసెంబ్లీ, ఎంపీ... రెండు ఓట్లూ టీఆర్ఎస్ పార్టీకే వేయాలి. టీఆర్ఎస్ నేతలను గెలిపిస్తే కేసీఆర్ ను గెలిపించినట్టే' అని ఆయన పిలుపునిచ్చారు. ఢిల్లీలో మనం చక్రం తిప్పాలంటే టీఆర్ఎస్ కే ఓటెయ్యాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే, ఎంపీలుగా టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు.