: మలేషియన్ పైలట్ భార్యను ప్రశ్నించనున్న ఎఫ్.బి.ఐ
ఈ నెల 8వ తేదీ నుంచి కనిపించకుండా పోయిన మలేషియన్ విమానం కేసులో... ఆ విమాన పైలట్ భార్యను అమెరికాకు చెందిన దర్యాప్తు సంస్థ ఎఫ్ బీఐ ప్రశ్నించనుంది. కెప్టెన్ జహారీ అహ్మద్ షా బహుశా ఈ విమానాన్ని హైజాక్ చేసి ఉండొచ్చన్న కథనాలు కూడా వెలువడుతోన్న నేపథ్యంలో ఆమెను ప్రశ్నించాలని ఎఫ్ బీఐ నిర్ణయించింది. ముగ్గురు పిల్లల తల్లి అయిన ఫైజా ఖాన్ త్వరలోనే ఎఫ్ బీఐ దర్యాప్తు ఎదుర్కొంటానని డైలీ మిర్రర్ తన కథనంలో పేర్కొంది. కెప్టెన్ అహ్మద్ షాతో పాటు పైలట్ ఫరీక్ అబ్దుల్ హమీద్ ఇద్దరి నేపథ్యం గురించి తెలుసుకొనేందుకు మలేషియన్ పోలీసులు, అమెరికన్ నిఘా సంస్థలు ప్రయత్నిస్తున్నాయి.