: ఓ ఇంటివాడైన యూసుఫ్ పఠాన్
భారత హార్డ్ హిట్టింగ్ బ్యాట్స్ మన్ యూసుఫ్ పఠాన్ ఓ ఇంటివాడయ్యాడు. తన మనసు దోచిన మగువ, ముంబయి ఫిజియో థెరపిస్ట్ అఫ్రీన్ ను యూసుఫ్ పరిణయమాడాడు. ఫక్తు కుటుంబ కార్యక్రమంలా సాగిన ఈ వివాహం ఈరోజు ముంబయిలో జరిగింది. యూసుఫ్, అఫ్రీన్ ల నిశ్చితార్థం గతేడాది బరోడా సమీపంలోని నదియాద్ వద్ద గల యూసుఫ్ సొంత ఫామ్ హౌస్ లో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే.