: మాదాపూర్ లో ప్రారంభమైన జైసమైక్యాంధ్ర సమీక్షా సమావేశం
హైదరాబాద్ మాదాపూర్ లో ఉన్న జైసమైక్యాంధ్ర పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ సమీక్ష సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశం ఆ పార్టీ అధినేత కిరణ్ అధ్యక్షతన కొనసాగుతోంది. రానున్న ఎన్నికల నేపథ్యంలో పార్టీ సంస్థాగత నిర్మాణం, జిల్లా కేడర్ ఏర్పాటు, అభ్యర్థుల ఎంపిక తదితర అంశాలపై చర్చిస్తున్నారు. అయితే ఈ సమావేశానికి ఆ పార్టీ కీలక నేతలు హర్షకుమార్, పితాని, శైలజానాథ్, సాయిప్రతాప్ లు గైర్హాజరయ్యారు.