: మోడీ కంటే సుష్మాయే బెటర్: దిగ్విజయ్
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సుష్మాస్వరాజ్ కు మద్దతు పలికారు. మోడీ కంటే ప్రధానమంత్రి పదవికి సుష్మాయే మంచి ఎంపిక అవుతారని ఈ రోజు భోపాల్ లో మీడియాతో మాట్లాడుతూ అన్నారు. వాజ్ పేయి వలే సుష్మా కూడా ఆమోదనీయ వ్యక్తిగా పేర్కొన్నారు. ఇప్పుడు బీజేపీ లేదు... ఉన్నదల్లా మోడీనే అని వ్యాఖ్యానించారు. హర్ హర్ మోడీ నినాదంపై మోడీ ఆలస్యంగా మేల్కొన్నారని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.