: ప్రభుత్వ సేవలకు ఆధార్ తప్పనిసరి కాదు: సుప్రీం
ఆధార్ కార్డులపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ప్రభుత్వ సేవలకు ఆధార్ కార్డు తప్పనిసరి కాదని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు ఆధార్ ను తప్పనిసరి చేస్తూ ఇచ్చిన జీవోలను వెనక్కి తీసుకోవాలని తెలిపింది. కార్డుదారుడి అనుమతి లేకుండా అతని కార్డు వివరాలను ఏ ప్రభుత్వ ఏజెన్సీకి అందించవద్దంటూ ఈ మేరకు దాఖలయిన పిటిషన్ ను విచారించిన సుప్రీం కేంద్ర అధార్ అథారిటీకి (యఐడిఏఐ)కి తెలిపింది.