: రండి ఎన్నికలు బహిష్కరిద్దాం: పోలవరం బాధితుల పరిరక్షణ సమితి
ఎన్నికలను బహిష్కరిద్దామని కుక్కనూరు మండల వాసులకు పోలవరం బాధితుల పరిరక్షణ సమితి పిలుపునిచ్చింది. ఈ మేరకు అన్ని పార్టీలకు లేఖలు రాసింది. దీనికి సీపీఎం మినహా మిగిలిన పార్టీలన్నీ సంసిద్ధత వ్యక్తం చేశాయి. స్థానికుల మనోభావాలు గౌరవించని ప్రభుత్వానికి ఎన్నికల బహిష్కరణ ద్వారా సమాధానం చెప్పాలని నిర్ణయించాయి. సీపీఎం మాత్రం ఎన్నికల బహిష్కరణకు తాము వ్యతిరేకమని స్పష్టం చేసింది.