: హై కొలెస్ట్రాల్... ఈజిప్షియన్ మమ్మీకీ తప్పలేదు!


మానవాళిని నేడు ఎలాంటి ఆరోగ్య సమస్యలు పట్టిపీడిస్తున్నాయో... పురాతనకాలంలోనూ అలాంటి రుగ్మతలే పట్టి పీడించేవన్న విషయం తాజాగా నిరూపితమైంది. ఈజిప్టు నుంచి సేకరించిన కొన్ని మమ్మీలకు లండన్ లోని ఓ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. వాటిల్లో కొన్నింటిలో హై కొలెస్ట్రాల్ ఆనవాళ్ళను గుర్తించారు. కార్బన్ డేటింగ్, ఇన్ ఫ్రా-రెడ్ రిఫ్లెక్టోగ్రఫీ పరిజ్ఞానం ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్నారు. తద్వారా గుండె సంబంధ వ్యాధుల కారణంగానే సదరు వ్యక్తులు మరణించి ఉండొచ్చని పరిశోధకులు చెబుతున్నారు.

అంతేగాకుండా ఆ మమ్మీలకు దంత సంబంధ సమస్యలు కూడా ఉన్నాయట. దంతాల దృఢత్వానికి అవసరమయ్యే కాల్షియం తక్కువస్థాయిలో ఉందని పరిశోధకులు తెలిపారు.

  • Loading...

More Telugu News