: మలేసియా విమానం హాంకాంగ్ లో ఎమర్జన్సీ ల్యాండింగ్


మలేసియా విమానం ఒకటి ఈ తెల్లవారుజామున హాంకాంగ్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండయింది. ఈ ఎయిర్ బస్ ఎ330-300 తరహా విమానం కౌలాలంపూర్ నుంచి సియోల్ వెళుతుండగా జనరేటర్ ఫెయిలైంది. లోపాన్ని గుర్తించిన సిబ్బంది విమానాన్ని హాంకాంగ్ లో దింపేశారు.

ముందే గ్రౌండ్ కంట్రోల్ కు సమాచారం అందించడంతో విమానాశ్రయంలో ఫైరింజన్లను మోహరించారు. అయితే, ప్రమాదమేమీ సంభవించకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఈ విమానంలో 271 మంది ప్రయాణికులున్నారు. ఇప్పటికే మలేసియా ఎయిర్ లైన్స్ విమానమొకటి కనిపించకుండా పోయిన ఘటన అందరినీ కుదిపేస్తున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News