: టీమిండియాకిదే తొలిసారి
ప్రపంచ క్రికెట్లో ఎన్నో రికార్డులను పాదాక్రాంతం చేసుకున్న టీమిండియా నిన్న వెస్టిండీస్ పై నమోదు చేసిన విజయానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ చరిత్రలో విండీస్ పై మనవాళ్ళకిదే తొలి విజయం. ఈ మినీ ఫార్మాట్ వరల్డ్ కప్ టోర్నీల్లో రెండు జట్లు పలుమార్లు తలపడినా కరీబియన్లదే పైచేయిగా ఉండేది. తాజా విజయంతో ఈ పరంపరకు ధోనీ సేన అడ్డుకట్ట వేసినట్టయింది. మిర్పూర్ లో నిన్న జరిగిన మ్యాచ్ లో టీమిండియా వెస్టిండీస్ ను 7 వికెట్ల తేడాతో చిత్తు చేసిన సంగతి తెలిసిందే.