: కార్పొరేటర్లు, జర్నలిస్టులకు ఐపాడ్ ల పంపిణీపై హైకోర్టు ఆగ్రహం
హైదరాబాదు పరిధిలో కార్పొరేటర్లు, జర్నలిస్టులకు జీహెచ్ఎంసీ ఐపాడ్ ల పంపిణీ వ్యవహారంపై రాష్ట్ర హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చెత్త తొలగించేందుకు డబ్బుల్లేని జీహెచ్ఎంసీ ఐపాడ్ ల పంపిణీ ఎందుకు చేస్తుందని ప్రశ్నించింది. అసలు ఏ చట్ట ప్రకారం వాటిని కొనుగోలు చేసేందుకు అనుమతి ఇచ్చారో తెలపాలని కోర్టు నిలదీసింది. అయితే, ఐపాడ్ ల అంశంపై మేయర్ ప్రతిపాదించారని... కానీ, కమిషనర్ సంతకం పెట్టలేదని న్యాయస్థానానికి జీహెచ్ఎంసీ విన్నవించింది.