: విభజనతో మంచి ఫలితాలు వస్తాయి: చిరంజీవి
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రచారబాధ్యతలు తనకు ఒక చాలెంజ్ అని కేంద్ర మంత్రి చిరంజీవి అన్నారు. కాంగ్రెస్ పార్టీలోకి కొత్త నీరు వస్తోందని చెప్పారు. కష్టపడితేనే ఎన్నికల్లో మంచి ఫలితాలు వస్తాయని చెప్పారు. బస్సు యాత్రను నిరాశతో ప్రారంభించామని... అయితే, కార్యకర్తలు తమలో ఉత్సాహం నింపారని తెలిపారు. విభజనతో మంచి ఫలితాలు వస్తాయని... రాష్ట్రం విడిపోవడం వల్లే పోలవరం ప్రాజెక్టు వచ్చిందని వెల్లడించారు. చంద్రబాబు వైఖరి పాత సామాన్లు కొనే వాడిలా ఉందని... సైకిల్ ను చూసి ఆయన బుల్ డోజర్ అనుకుంటున్నారని చిరంజీవి ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీని వీడుతున్న వారంతా అసమర్థులు, వయసు పైబడిన వారే అంటూ విమర్శించారు.