: రాజకీయాల్లోకి రావాలని వారిద్దరూ ఆహ్వానించారు: 'సీబీఐ' లక్ష్మీనారాయణ
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ప్రస్తుత ఎన్నికలపై మాట్లాడారు. తనను రాజకీయాల్లోకి రావాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఆహ్వానించారని వెల్లడించారు. అయితే, తనకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాదులో నేడు లీడ్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ విషయాలు వెల్లడించారు. వారి ఆహ్వానాలను తాను సున్నితంగా తిరస్కరించానని తెలిపారు.