: బాబుకు విశ్వసనీయత లేదంటున్న విజయమ్మ
వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై విమర్శనాస్త్రాలు సంధించారు. మామ ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు అని, ఆయనకు ప్రజల్లో విశ్వసనీయత లేదని పేర్కొన్నారు. చంద్రబాబు వస్తున్నారు జాగ్రత్త అని ఆమె ప్రజలను హెచ్చరించారు. కర్నూలు జిల్లా డోన్ లో జనభేరి సభ సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాలను జగన్ నెరవేరుస్తాడని చెప్పారు.