: టికెట్లు రాకుండా కొందరు కుట్ర చేస్తున్నారు: కోమటిరెడ్డి
మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నేడు మీడియాతో మాట్లాడారు. సిట్టింగ్ ప్రజాప్రతినిధులకే నల్గొండ జిల్లాలో టికెట్లొస్తాయని భావిస్తున్నామని తెలిపారు. అయితే, కొందరు టికెట్లు రాకుండా కుట్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు. భువనగిరి స్థానానికి పొన్నాల తన పేరు ప్రతిపాదించుకోవడం దారుణమని విమర్శించారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ పార్టీని వీడబోమని స్పష్టం చేశారు. కాగా, కోమటిరెడ్డికి టికెట్ ఇస్తే ఓటమి ఖాయమని కాంగ్రెస్ సీనియర్ నేత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి వ్యాఖ్యానించడం తెలిసిందే.