: ఆందోళన చెందుతున్నారా? పళ్లు రాలతాయి జాగ్రత్త!
ప్రతీ చిన్న విషయానికి ఆవేదనకు, బాధకు, ఒత్తిడికి లోనవుతున్నారా? అయితే జాగ్రత్త. దాని ప్రభావం నోటిలోని దంతాలపై పడుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఈ ప్రభావం ఎక్కువైతే దంతాలు ఊడిపోయే ప్రమాదం కూడా ఉంటుందని వెస్ట్ వర్జీనియా వర్సిటీ శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ మేరకు వీరు ఒక అధ్యయనం నిర్వహించారు. 76 వేల మందిపై భిన్న రకాలుగా అధ్యయనం చేయగా... ఈ విషయాలు వెలుగు చూశాయి.