: రాజమండ్రి నుంచి పోటీకి సిద్ధం: నటుడు అలీ


హాస్య నటుడు అలీ కూడా ప్రజాసేవకు సిద్ధమంటున్నారు. ప్రజలు కోరితే రాజమండ్రి శాసనసభ స్థానం నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. తూర్పుగోదావరి జిల్లా వెలుగుబందలోని ఓ ఇంజనీరింగ్ కాలేజీ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలోనూ పోటీ చేయాలంటూ తనకు ఆహ్వానాలు అందాయని వెల్లడించారు. పవన్ ముక్కుసూటి మనిషి అని, జనసేనకు మద్దతు ఇవ్వాలని ఆయన ఎవరినీ బలవంతం చేయలేదని చెప్పారు.

  • Loading...

More Telugu News