: పవిత్ర భారత్ ను చూడాలని వచ్చాడు... గంగా నదికి బలయ్యాడు
అతడు అమెరికా నుంచి భారత్ కు వచ్చాడు... ఇక్కడి ఆధ్యాత్మిక విశేషాలు చూసి వెళ్లాలనుకున్నాడు. కానీ, ఒకరి ప్రాణాలను రక్షించబోయి తను ప్రాణాలు కోల్పోయాడు. అమెరికాలోని మియామీ, న్యూయార్క్ తదితర ప్రాంతాల్లో అర్జెంటైన్ రెస్టారెంట్లను నిర్వహిస్తున్న హెక్టర్ రొలోట్టి గత సోమవారం తన భార్యతో కలసి గంగానది ఒడ్డున ఉండగా, ఒకరు నీటిలో ముగినిపోతూ రక్షించాలంటూ కేకలు వేశారు. వెంటనే రొలోట్టి నీటిలో దూకాడు. కానీ, తిరిగి రాలేదు. నాలుగు రోజుల పాటు గాలించగా.. చివరికి శనివారం అతడి మృతదేహం లభ్యమైంది. అయితే, గంగానదిలో ఏ ప్రాంతంలో ఇది జరిగిందో అర్జెంటైన్ రెస్టారెంట్ గ్రూపు తెలియజేయలేదు.