: మనం చేసుకోవాల్సింది పునర్నిర్మాణం కాదు నిర్మాణమే: బాబు
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏపీజేఎఫ్ మీట్ ద పీపుల్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విభజన తర్వాత సీమాంధ్రలో జరగాల్సింది పునర్నిర్మాణం కాదని, క్షేత్రస్థాయి నుంచి నిర్మాణం చేపట్టాల్సిన పరిస్థితి నెలకొని ఉందని స్పష్టం చేశారు. రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత సీమాంధ్రకు నిధులు తేవడం అత్యవసరమని తెలిపారు. తెలంగాణ ఇవ్వాలంటే సీమాంధ్రులను మెప్పించాలని కోరానని, కానీ కాంగ్రెస్ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ఇలాంటి విభజన ఎన్నడూ చూడలేదని పేర్కొన్నారు. ఇప్పుడందరిలో అభద్రత భావం పెరిగిపోయిందని వివరించారు.