: అళగిరి మద్దతు కోరిన వైగో
తండ్రి కరుణానిధి ఆగ్రహంతో డీఎంకే నుంచి బహిష్కరణకు గురైన ఎంపీ అళగిరితో ఎండీఎంకే అధినేత వైగో చెన్నైలో ఈ రోజు సమావేశమయ్యారు. లోక్ సభ ఎన్నికల్లో తమకు మద్దతు ఇవ్వాలని కోరారు. అళగిరి ఇప్పటికే బీజేపీ అధ్యక్షుడు రాజ్ నాథ్ తో భేటీ అయి ఎన్నికల్లో మద్దతు ఇవ్వడానికి సంసిద్ధత ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమిళనాడులో బీజేపీతో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళుతున్న ఎండీఎంకే అళగిరి మద్దతు కోరడం ప్రాధాన్యం సంతరించుకుంది. అళగిరిని కలవడానికి ఆయన నివాసానికి వచ్చిన వైగో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఎన్నికల్లో ఎన్డీయేకు మద్దతు ఇవ్వాలని అళగిరిని కోరానని చెప్పారు.