: మాది విలువలతో కూడిన పార్టీ కాబట్టే వస్తున్నారు: చంద్రబాబు
విజయవాడ తూర్పు ఎమ్మెల్యే యలమంచిలి రవి పార్టీలో చేరిన సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడారు. తమది విలువలతో కూడిన పార్టీ కాబట్టే నేతలు చాలామంది వస్తున్నారని తెలిపారు. సీమాంధ్ర పునర్నిర్మాణం టీడీపీతోనే సాధ్యమని బాబు పునరుద్ఘాటించారు. అందుకు టీడీపీ అధికారంలోకి రావాల్సిన అవసరముందని పేర్కొన్నారు. క్లిష్ట సమయంలో సీమాంధ్రను పాలించే సత్తా టీడీపీకే ఉందని ఆయన స్పష్టం చేశారు. ఇక, క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేయాల్సిన బాధ్యత కార్యకర్తలదే అని బాబు పిలుపునిచ్చారు. మున్సిపల్, ఇతర స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.