: టీడీపీ తెలంగాణ ప్రచార కమిటీ చైర్మన్ గా కృష్ణయ్య!
ఎన్నికల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ తెలంగాణ విభాగం ప్రచార కమిటీ చైర్మన్ గా రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య నియామకం దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. ఇక స్టీరింగ్ కమిటీ చైర్మన్ గా పార్టీ బీసీ నేత ఎల్. రమణ, వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎర్రబెల్లి దయాకర్ రావు, మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా రావుల పేర్లను నేడు ప్రకటించనున్నారు. గత రాత్రి ఈ నియామకాల విషయమై చంద్రబాబు తెలంగాణ నేతలతో సుదీర్ఘంగా చర్చించారు.