: ముంబయి-అహ్మదాబాద్ హైవేపై ట్యాంకర్ దగ్ధం... ఏడుగురి మృతి


మహారాష్ట్రలోని థాణే జిల్లాలో నేడు ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ముంబయి-అహ్మదాబాద్ హైవేపై ప్రయాణిస్తున్న ఓ పెట్రోల్ ట్యాంకర్ అగ్నికి ఆహుతైంది. ఈ ప్రమాదంలో ఏడుగురు మరణించారు. తొమ్మిది మంది గాయపడ్డారు. చవోరీ చెక్ పోస్ట్ వద్ద ఈ దుర్ఘటన జరిగింది. ట్యాంకర్ బోల్తాపడడంతో మంటలు చెలరేగి ప్రమాదం జరిగినట్టు పోలీసులు తెలిపారు. మరణించిన వారిలో ముగ్గురు అదే ట్యాంకర్ లో ప్రయాణిస్తుండగా, మరో నలుగురు రోడ్డుపై వెళుతూ మృత్యువాత పడ్డారు. గాయపడిన వారిని ముంబయిలోని కాసా ఆసుపత్రికి తరలించారు.

  • Loading...

More Telugu News