: లంక జయభేరి


టి20 వరల్డ్ కప్ లో శ్రీలంక జయభేరి మోగించింది. చిట్టగాంగ్ లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో లంకేయులు ఐదు పరుగుల తేడాతో విజయం సాధించారు. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 165 పరుగులు చేయగా... లక్ష్యఛేదనలో సఫారీలు ఓవర్లన్నీ ఆడి 8 వికెట్లకు 160 పరుగులే చేశారు. ఆ జట్టులో జేపీ డుమినీ (39) టాప్ స్కోరర్. లంక బౌలర్లలో సేనానాయకే రెండు కీలక వికెట్లు తీశాడు. ఆమ్లా (23), డుమినీ... సేనానాయకే బౌలింగ్ లో వెనుదిరిగారు. లంక ఇన్నింగ్స్ లో 61 పరుగులు చేసిన ఓపెనర్ కుశాల్ పెరీరాకు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' లభించింది.

  • Loading...

More Telugu News