: తెలుగుదేశం పార్టీలో చేరతా: యలమంచిలి రవి
కాంగ్రెస్ లో అవమానాలు పడలేకపోతున్నానని ఎమ్మెల్యే యలమంచిలి రవి ఓ తెలుగు చానల్ ఇంటర్వ్యూలో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ప్రజారాజ్యం నుంచి వచ్చిన వారికే అవమానం జరుగుతోందని చెప్పారు. బీఫాంలు మొత్తం దేవినేని నెహ్రూకే ఇచ్చారని ఈ విషయాన్ని చిరంజీవికి చెప్పినా, పీసీసీ పెద్దలకు చెప్పినా పట్టించుకోలేదన్నారు. స్థానిక ఎమ్మెల్యే అయిన తనను విస్మరించి, మిగతావాళ్లకు బీఫాంలు ఇస్తున్నారని తెలిపారు. రెండు మూడు రోజుల్లో టీడీపీ అధినేత చంద్రబాబును కలుస్తానని, టీడీపీలో చేరతానని వెల్లడించారు.