: విండీస్ కు ఆ కిటుకు తెలీదు: రైనా


వెస్టిండీస్ జట్టుతో మ్యాచ్ కు ముందే మాటల యుద్ధం మొదలైంది. కరీబియన్ బ్యాట్స్ మెన్ కు స్పినర్ల బౌలింగ్ లో సింగిల్స్ తో స్ట్రయిక్ రొటేట్ చేయడం ఎలాగో తెలీదని వ్యాఖ్యానించాడు. మిశ్రా అండ్ కో విండీస్ జట్టును చుట్టేయడానికి ఈ ఒక్క లోపం చాలని అభిప్రాయపడ్డాడు. విండీస్ టాపార్డర్ లో మంచి ఆటగాళ్ళే ఉన్నారని, అయితే, వాళ్ళు సిక్సులు, ఫోర్లు కొట్టేందుకు మొగ్గు చూపుతారని చెప్పుకొచ్చాడు. సింగిల్స్ తీస్తూ స్ట్రయిక్ మార్చుకోవడంపై వారికి పెద్దగా అవగాహన లేదని రైనా పేర్కొన్నాడు. తమకు మిశ్రా, అశ్విన్, జడేజా రూపంలో ముగ్గురు నాణ్యమైన స్పిన్నర్లు ఉన్నారని తెలిపాడు.

  • Loading...

More Telugu News