: విభజన ప్రక్రియపై గవర్నర్ సమీక్ష
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతితో పాటు విభజన కమిటీలకు నాయకత్వం వహిస్తున్న అధికారులతో గవర్నర్ నరసింహన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, విభజన ప్రక్రియను వేగవంతం చేసేందుకు అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. భవనాలు, ఆస్తుల విభజన ప్రక్రియ వేగంగా కొనసాగితే తప్ప... జూన్ 2 నాటికి రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు తగిన కార్యాలయాలను ఏర్పాటు చేయలేమని చెప్పారు. ఇందుకోసం మే రెండో వారానికల్లా అన్నింటిని సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.