: సీఎంకు దత్తాత్రేయ 65వ లేఖ
రాష్ట్రంలో కరెంట్ కోతలపై బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి లేఖ రాశారు. కరెంటు కోతల్లో రాష్ట్ర ప్రభుత్వం రికార్డు సృష్టించిందని తన 65వ బహిరంగలేఖలో విమర్శించారు. నాలుగు గంటలైనా విద్యుత్ అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల్లో విపక్షాలు సర్కారును నిలదీసినా ఎటువంటి సమాధానం లేదన్నారు. ఇప్పటికైనా సమస్యకు పరిష్కారాలు వెతకాలని దత్తాత్రేయ సూచించారు.