: నేను నోరు తెరిస్తే చిరు పారిపోతారు: కిరణ్
మాజీ ముఖ్యమంత్రి, జై సమైక్యాంధ్ర అధ్యక్షుడు కిరణ్ కుమార్ రెడ్డి రెండవ రోజు రోడ్ షో కృష్ణా జిల్లాలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, తాను నోరు తెరిచి నిజాలు బయటపెడితే చిరంజీవి పారిపోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. కనీసం ఇంట్లో నుంచి కూడా బయటకు రాలేరని అన్నారు. తాను రెండు, మూడు నెలల ముందే పదవికి రాజీనామా చేస్తే... చిరంజీవి ఇప్పటిదాకా తన పదవికి రాజీనామా చేయలేదని విమర్శించారు. రాసుకుని తెచ్చుకున్నది రాజ్యసభలో చదవి వినిపించిన చిరుకు తమను విమర్శించే హక్కు లేదన్నారు. పెడన, కైకలూరులో కిరణ్ రోడ్ షో జరుగుతోంది.