: భక్తులతో తిరుమల కిటకిట


ఒకవైపు ఇంటర్ విద్యార్థుల పరీక్షలు అయిపోవడం, మరోవైపు ఫాల్గుణ పౌర్ణమి పర్వదినం కావడంతో తిరుమల కొండకు భక్తులు భారీగా విచ్చేశారు. దీంతో స్వామి దర్శనానికి చాలా సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 8 గంటలు, కాలినడకన వచ్చిన వారు దర్శనం చేసుకునేందుకు 9 గంటల సమయం తీసుకుంటోంది. ఇక ధర్మ దర్శనానికి 18 గంటలు పడుతోంది. 31 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. మరోవైపు ఫాల్గుణ పౌర్ణమి కావడంతో తిరుమలలోని తుమ్మూరు తీర్దానికి తమిళనాడు, కర్ణాటకల నుంచి భక్తులు అధికంగా వచ్చారు. 

  • Loading...

More Telugu News