: గన్నవరం సీటివ్వకుంటే రాజకీయాలకు రాజీనామా: వంశీ
టీడీపీ కృష్ణా జిల్లా నేత వల్లభనేని వంశీ అసంతృప్తి వెళ్లగక్కారు. తనకు గన్నవరం సీటు ఇస్తానని పార్టీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారని.. ఒకవేళ ఇవ్వకుంటే రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు. ఏ పార్టీలోనూ చేరనని స్పష్టం చేశారు. వాస్తవానికి వంశీ విజయవాడ లోక్ సభ స్థానాన్ని ఆశిస్తున్నారు. అయితే, ఆ సీటును కేసినేని ట్రావెల్స్ అధినేత నానికి ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సహకరించాలని వంశీని కోరిన సంగతి తెలిసిందే.