: తెలంగాణ వ్యక్తిగా మల్కాజ్ గిరి నుంచి పోటీ చేయాలనుకుంటున్నా: రేవంత్ రెడ్డి


హైదరాబాదులోని మల్కాజ్ గిరి పార్లమెంటు నియోజకవర్గం హాట్ టాపిక్ గా మారింది. పార్టీలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరి దృష్టి ఈ స్థానం మీదే ఉంది. తాజాగా... తెలంగాణకు చెందిన వ్యక్తిగా, స్థానికుడిగా మల్కాజ్ గిరి నుంచి పోటీ చేయాలనుకుంటున్నానని టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి మనసులోని మాటను బయటపెట్టారు. మల్కాజ్ గిరి నుంచి పలువురు సీమాంధ్రులు, స్థానికేతరులు బరిలోకి దిగాలని భావిస్తున్నారని... వారిని తెలంగాణ ప్రజలు అంగీకరించరని తెలిపారు. ఉద్యమం చేసి తెలంగాణను సాధించుకున్నది స్థానికుల అవకాశాల కోసమేనని రేవంత్ చెప్పారు.

  • Loading...

More Telugu News