: అద్వానీని బీజేపీ అవమానించింది: శివసేన


ఎన్డీఏ భాగస్వామి అయిన శివసేన, బీజేపీ మధ్య ఏదో ఒక విషయంలో వివాదం ఏర్పడుతోంది. తాజాగా పార్టీ అగ్రనేత ఎల్ కే అద్వానీ పోటీ చేసే విషయంలో నెలకొన్న టెన్షన్ పై శివసేన మండిపడింది. అద్వానీ పట్ల బీజేపీ అమర్యాదకరంగా వ్యవహరిస్తోందని పార్టీ పత్రిక సామ్నాలో రాసిన సంపాదకీయంలో మండిపడింది. నరేంద్ర మోడీ హవా మొదలైనప్పటికీ దాని అర్థం అద్వానీ ప్రాభవం తగ్గిపోయినట్లు కాదని పేర్కొంది. అద్వానీ రాజకీయ జీవితం ఎలాంటి మచ్చ లేనిదని, అటువంటి నేతను బీజేపీ అవమానించిందని ఆరోపించింది. పార్టీలో సీనియర్ నేత అయిన ఆయనకు... ఎక్కడ నుంచి పోటీ చేయాలనే విషయంలో స్వేచ్ఛగా నిర్ణయం తీసుకునే అధికారం లేదా? అని ప్రశ్నించింది.

  • Loading...

More Telugu News