: మోడీపై శ్రీశ్రీ రవిశంకర్ యూ టర్న్
ఆధ్యాత్మిక వేత్త శ్రీశ్రీ రవిశంకర్ మోడీ విషయంలో తన స్టాండ్ మార్చుకున్నారు. కొన్ని రోజుల క్రితమే మోడీకి మద్దతు ప్రకటించిన ఈ పెద్దాయన... ప్రధానిగా మోడీకి తాను మద్దతు పలకలేదని తాజాగా చెప్పారు. కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పడాలని కోరుకుంటున్నట్లు ఓ ప్రైవేటు టీవీ చానల్ కు చెప్పారు. రవిశంకర్ పరోక్షంగా కాంగ్రెస్ తీరును తప్పుబట్టారు. ప్రతి పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థిని ముందుగానే ప్రకటించాలని, తమకు నచ్చిన వారిని ఎంపిక చేసుకునే అవకాశం ఓటర్లకు ఉండాలని అభిప్రాయపడ్డారు. ప్రజలను అంధకారంలో ఉంచరాదన్నారు. రేపు తమను పాలించేది ఎవరో ముందుగానే తెలుసుకునే అవకాశం వారికి ఉండాలని చెప్పారు. అదే సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ, అరవింద్ కేజ్రీవాల్ కు మద్దతు తెలపడం లేదన్నారు. పీఎం పదవిని నిర్వహించగల అనుభవం కేజ్రీవాల్ కు లేదని రవిశంకర్ చెప్పారు.