: ఇది మంచి అవకాశం... వినియోగించుకోండి: చిరంజీవి
కాంగ్రెస్ పార్టీకి కొత్త రక్తం ఎక్కించేందుకే 13 జిల్లాల్లో పర్యటిస్తున్నామని కేంద్ర మంత్రి చిరంజీవి స్పష్టం చేశారు. కీలక నేతలు పార్టీని వీడటం బాధించిందని... ద్వితీయ శ్రేణి నాయకత్వానికి ఇదొక మంచి అవకాశమని... దీన్ని వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. విశాఖలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ రోజు చిరంజీవి మాట్లాడారు. ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు విశాఖ జిల్లాలోనే ఎక్కువ ఓట్లు వచ్చాయని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. శ్రీకాకుళం జిల్లాలో బస్సు యాత్ర విజయవంతమయిందని చెప్పారు. ప్రజలకు నిజాలు తెలియజేసేందుకే బస్సు యాత్ర చేపట్టామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీని బలహీన పరిచేందుకు ఇతర పార్టీలు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. సమైక్య ముసుగులో కొంత మంది లబ్ధి పొందాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.