: ఢిల్లీ వెళ్లిన టీకాంగ్ ముఖ్య నేతలు
తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ ముఖ్యనేతలు ఈ ఉదయం ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఎలక్షన్ స్క్రీనింగ్ కమిటీ ముందు ఎన్నికల అభ్యర్థిత్వాలకు సంబంధించిన అభిప్రాయాలను తెలియజేసేందుకు వీరంతా హస్తిన వెళ్లారు. ఢిల్లీ వెళ్లిన వారిలో పొన్నాల లక్ష్మయ్య, ఉత్తమ్ కుమార్ రెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి, మధుయాష్కీ, గీతారెడ్డి, సురేష్ రెడ్డి తదితరులు ఉన్నారు.