: ఎయిర్ ఫోర్స్ పరీక్షకు శిక్షణ తీసుకుంటా: నిందితుడి విజ్ఞప్తి


ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐఏఎఫ్) పరీక్ష కోసం శిక్షణ తీసుకునేందుకు అనుమతించాలని ఢిల్లీ అత్యాచార కేసులో నిందితుడైన వినయ్ శర్మ కోరుతున్నాడు. ఈ మేరకు అతని న్యాయవాది.. ఫాస్ట్ ట్రాక్ కోర్టులో పిటిషన్ వేశాడు. ఎయిర్ ఫోర్స్ లో గ్రూప్ 'సి' సివిలియన్ పరీక్షకోసం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి కాల్ లెటర్ వచ్చిందని.. ఈ పరీక్ష కోసం శిక్షణ తీసుకోవడానికి అనుమతి ఇవ్వాలని పిటిషన్ లో నిందితుడు శర్మ అభ్యర్థించాడు. తనపైనే కుటుంబం ఆధారపడిందని కనుక అనుమతివ్వాలని పిటిషన్ లో కోరాడు. 

  • Loading...

More Telugu News